Header Banner

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

  Mon Apr 28, 2025 10:42        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మైనారిటీల అభివృద్ధి కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాయితీ రుణాలను ఇవ్వనుంది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మైనారిటీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.173.57 కోట్లు కేటాయించింది. ఈ డబ్బుతో మైనారిటీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు (MSME) ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, కార్పెంటరీ వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తారు. దీని కోసం దరఖాస్తులు నేటి నుంచి వచ్చే నెల 25 వరకు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. మైనార్టీలకు సంబంధించిన ఈ పథకంలో లబ్ధిదారులకు యూనిట్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును బ్యాంకు మొదట విడుదల చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని మాత్రం బ్యాంకులో టర్మ్ డిపాజిట్ రూపంలో ఉంచుతారు.

 

ఇది కూడా చదవండి: నిన్నటి విధ్వంసం నుంచి.. రేపటి వికాసం వైపు ప్రయాణం! ఆంధ్రులు గర్వపడేలా అమరావతి!

 

యూనిట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారు.. ఒక థర్డ్ పార్టీ ద్వారా రెండు సార్లు తనిఖీ చేయిస్తారు. యూనిట్ మొదలు పెట్టిన రెండేళ్ల తర్వాత మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మరోసారి తనిఖీ చేస్తారు. అప్పుడు లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ డబ్బును సరిగ్గా కడుతున్నాడా లేదా అని చూస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే రాయితీ డబ్బును అతని లోన్ ఖాతాకు జమ చేస్తారు. ఈ పథకంలో రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఈ పథకంలో యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వ్యయంతో రాయితీ రుణాలను అందించనుంది. ఈ పథకానికి సంబంధించి నాలుగు రకాల విభాగాలు ఉన్నాయి. 'రూ.లక్ష, రూ.లక్ష పై నుంచి రూ.3 లక్షలు, రూ.3 లక్షల పై నుంచి రూ.5 లక్షలు, రూ.5 లక్షల పై నుంచి రూ.8 లక్షల వరకు లోన్ ఇస్తారు' అని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఖర్చులో ప్రభుత్వం 50% రాయితీ ఇస్తుండగా.. మిగతా డబ్బును బ్యాంకుల ద్వారా లోన్‌గా ఇప్పిస్తారు. కొన్ని సందర్భాల్లో రాయితీ డబ్బులో మార్పులు ఉండవచ్చు. ముస్లిం యువతి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations